Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. కారణం ఇదే!

Char Dham Yatra halted
  • యాత్రకు అడ్డంకిగా మారిన ప్రతికూల వాతావరణం
  • వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో విరిగిపడుతున్న కొండ చరియలు
  • యాత్రను ఆపేయాలంటూ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు
చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన ఆదేశాల మేరకు యాత్రను ఆపేశారు. 

వారం రోజులుగా మంచు, వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ ధామ్ యాత్రను కొనసాగించాలని భక్తులను ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు రానున్న 24 గంటల్లో టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Char Dham Yatra
Halt

More Telugu News