Nara Lokesh: ​లోకేశ్ సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • 1800 కి.మీ మైలురాయి చేరుకున్న యువగళం
  • 50 వైసీపీ కుటుంబాలకు టీడీపీలోకి స్వాగతం పలికిన లోకేశ్
YCP leaders joins TDP

టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. యువగళం పాదయాత్ర 138వ రోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. 

ఈ సందర్భంగా లోకేశ్.... అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో ఆక్వా రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇస్తూ, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో కుదేలైన ఆక్వా రంగానికి మేము అందించబోయే ప్రోత్సాహకాలు ఊతమిస్తాయని తెలిపారు. 

సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో సోమవారం నాడు వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అన్నమేడు యువగళం క్యాంపు సైట్ లో లోకేశ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

వైసీపీ ముఖ్య నాయకులు తడ మాజీ ఎంపీపీ రమేష్, నాయుడుపేట ఏఎంసీ మాజీ డైరెక్టర్, రోసనూరు గ్రామ మాజీ సర్పంచ్ సత్యంరాజు, నాయుడుపేట ఏఎంసీ మాజీ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వేమగుంట గ్రామానికి చెందిన వైసీపీ కీలక నాయకుడు డి.శ్రీనివాసులురెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఆ పార్టీ వారే భరించలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు టీడీపీలోకి వచ్చేవారెవరినైనా ఆహ్వానిస్తామని చెప్పారు. వైసీపీ దుర్మార్గాలకు నిరససగా పార్టీలోకి వచ్చిన నాయకులను లోకేశ్ అభినందించారు.

పేదలకు ఇళ్లబిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్న సైకో

నాలుగేళ్లుగా జగన్ పాలనలో జనం నరకం అనుభవిస్తున్నారని, టీడీపీ హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

సూళ్లూరుపేట నియోజకవర్గం అన్నమేడు గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 63 వేల మెజారిటీతో గెలిచిన సూళ్లూరుపేట శాసనసభ్యుడు కనీసం రైతు భరోసా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది రూ.20 వేలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటాం. గతంలో ఇచ్చినట్టే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పిల్ల కాలువలు తవ్వి ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం. చెరువుల్లో పూడిక తీస్తాం" అని వెల్లడించారు.

లోకేశ్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పూర్వ విద్యార్థి కరుణాకర్

తనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే, జ్ఞానం ఇచ్చింది ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని నల్ల మాకల కరుణాకర్ తెలిపారు. పాదయాత్రలో ఉన్న లోకేశ్ ను కరుణాకర్ నేడు కలిశారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనకి చేసిన సాయం జీవితాంతం మరువలేనని, ఆ మహానుభావుడి దయవల్ల తాను ఇప్పుడు సొంతూరు దగ్గర్లోనే నెలకి రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగం చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ తనకి చేసిన సాయానికి నారా లోకేశ్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మనవాలి గ్రామానికి చెందిన టీడీపీ నేత నల్లమాకల కస్తూరయ్యపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇంటి పెద్ద మంచాన పడటంతో నలుగురు పిల్లల చదువులు ప్రశ్నార్థకమయ్యాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబు 2007లో కరుణాకర్ ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించగా అక్కడే ఇంటర్ పూర్తి చేశారు. గుంటూరు నలందలో బీటెక్ అయ్యాక, శ్రీసిటీలోని కెలోగ్స్ ఫుడ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సంపాదించారు. మెరుగైన జీతంతో ఇప్పుడు కుటుంబ బాధ్యతల్ని కూడా కరుణాకర్ చూస్తున్నారు. 

తనలాగే ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు గారు విద్యావంతులుగా తీర్చిదిద్దారని, ఇదే స్ఫూర్తితో తాను నిరుపేద పిల్లలకి సాయం అందించి తెలుగుదేశం పార్టీ లక్ష్యాన్ని నెరవేరుస్తానని కరుణాకర్ చెబుతున్నారు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1806 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 19.2 కి.మీ.*

*139వ రోజు పాదయాత్ర వివరాలు (27-6-2023):*

*గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు (తిరుపతి జిల్లా):*

మధ్యాహ్నం 

2.00 – తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ లో మత్స్యకారులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – కొత్తగుంటలో రైతులతో సమావేశం.

4.50 – చిట్టమూరులో స్థానికులతో సమావేశం.

5.20 – వాకాడు ఎస్టీ కాలనీలో స్థానికులతో సమావేశం.

6.20 – వాకాడు బిసి కాలనీలో బీసీ సామాజికవర్గీయులతో భేటీ.

6.30 – వాకాడు టెంపుల్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

6.50 – వాకాడు అశోకా పిల్లర్ వద్ద స్థానికులతో సమావేశం.

7.20 – రంగన్నగుంటలో స్థానికులతో సమావేశం.

7.50 – తినెళ్లపూడిలో స్థానికులతో సమావేశం.

8.20 – కోట క్రాస్ విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News