Pawan Kalyan: జగన్ నొక్కని బటన్ లిస్టు ఇదే: పవన్ కల్యాణ్

  • నరసాపురంలో పవన్ వారాహి విజయ యాత్ర
  • బహిరంగ సభలో ప్రసంగించిన జనసేనాని
  • పనికిమాలిన సలహాదారులు ఉన్నా ఉపయోగం లేదంటూ విమర్శలు
  • నరసాపురంలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలేకపోయారని వెల్లడి
Pawan Kalyan take a dig at CM Jagan

నరసాపురం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పనికిమాలిన మీ సలహాదారులు ఎంతమంది ఉన్నా, నరసాపురంలో కనీసం ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. ఈ సందర్భంగా, జగన్ నొక్కని బటన్ లిస్టు ఇదేనంటూ పవన్ కల్యాణ్ ఓ జాబితా చదివి వినిపించారు.

  • పూర్తికాని పోలవరం ప్రాజెక్టు బటన్
  • ఇంకా రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్
  • నష్టపోయిన రైతుల పరిహారం బటన్
  • ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్
  • మద్దతు రాని కొబ్బరిసాగు బటన్
  • దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్ 
  • ఇప్పటికీ పూర్తి కాని బ్రిడ్జి బటన్
  • దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్
  • ఆక్వారైతుకు రూ.1.5కి యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్
  • అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్
  • మూతపడిన 8 వేల పాఠశాలల బటన్
  • కొత్త కాలువలు కాదు కదా, కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బటన్
  • ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్
  • తాగునీరు దొరకని గ్రామాల బటన్
  • స్వయం ఉపాధి కల్పించలేని బటన్
  • అప్పుల్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ బటన్
  • నిలిచిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన బటన్
  • నిరుద్యోగ యువత ఉపాధి బటన్
  • ఆడబిడ్డల మాన ప్రాణాల బటన్...
...ఈ బటన్లు ఎప్పుడు నొక్కుతారు? అంటూ పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. కానీ జనసేన వస్తే బటన్ నొక్కనని, ప్రజల కోసం ఓ ముఠామేస్త్రీలా పనిచేస్తానని తెలిపారు. ఒక రెల్లి కార్మికుడు చెత్తను తొలగిస్తే, తాను రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిచేస్తానని వెల్లడించారు. 

ఇక ప్రసంగం చివర్లో పవన్ కల్యాణ్ పలు నినాదాలు చేశారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి... అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి... అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి... హలో ఏపీ... బైబై వైసీపీ అంటూ ప్రజలతోనూ నినాదాలు చేయించారు.

More Telugu News