Nitin Gadkari: కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్

Harish Shankar meets Nitin Gadkari
  • కేంద్రమంత్రిని కలిసిన ఫోటోలను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన దర్శకుడు
  • భారతీయ రహదారుల ఆధునిక రూపశిల్పి అంటూ ప్రశంస
  • మీతో సమయం గడిపినందుకు ఆనందంగా ఉందని ట్వీట్
ప్రముఖ తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. కేంద్రమంత్రిని కలిసిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. భారతీయ రహదారుల ఆధునిక రూపశిల్పిని, దూరదృష్టి కలిగిన నాయకుడు నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 'మీతో సమయం గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది సర్' అంటూ ట్వీట్ లో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లు నైస్ అంటూ స్పందించారు.

Nitin Gadkari
harish shankar

More Telugu News