renuka chaudhary: ఈటల కూడా వస్తున్నారా? అవునా.. వస్తే బానే ఉంటుంది: రేణుకాచౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

  • పొంగులేటి రాకను తాను వ్యతిరేకించలేదన్న రేణుకా చౌదరి
  • రాజగోపాల్‌ది ఇంటి వ్యవహారమేనని వ్యాఖ్య
  • ఆయన హృదయం ఎప్పుడూ కాంగ్రెస్ వైపేనని వెల్లడి
  • సౌత్‌లో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరికలు
sensational comments of renuka chaudhary after the meeting with ponguleti

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరికలపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధిష్ఠానం అంగీకరించిన వాళ్లందరూ పార్టీలోకి వస్తారని, ఎవరు పార్టీలోకి వచ్చినా తాను ఆహ్వానిస్తానని చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరితే బాగుంటుందని అన్నారు.

పొంగులేటి రాకను తాను వ్యతిరేకించలేదని చెప్పారు. తాజా భేటీలో తమ మధ్య సీట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని, సీట్ల విషయంలో ఆయన ఏ డిమాండ్లు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్‌లో ఆశించేవారు ఆకాశమంత ఉంటారని, కానీ కొందరికే అవకాశాలు వస్తాయని రేణుకా చౌదరి అన్నారు. 

‘‘ఈటల గారు కూడా వస్తున్నారా? అవునా.. అది రూమరా ఇప్పుడు. తర్వాతి చాప్టరా? వస్తే బానే ఉంటుంది. ఇంకెవరు వస్తున్నారు? రాజగోపాల్ రెడ్డా? ఆయన వెళ్లింది ఎప్పుడు?రాజగోపాల్‌ది ఇంటి వ్యవహారం. ఆయన హృదయం ఎప్పుడూ ఇక్కడే (కాంగ్రెస్)” అని అన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారన్న విమర్శలపై బీజేపీలో కోవర్టులు లేరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా బాగుందన్నారు. సౌత్‌లో బీజేపీ ఆటలు సాగవని, సౌత్ సెంటిమెంట్ మోదీ, అమిత్ షా, నడ్డాలకు అర్థం కాలేదన్నారు. సౌత్ ఇండియాతో చెలగాటం అడొద్దని హెచ్చరించారు.

More Telugu News