Asaduddin Owaisi: తెలంగాణలో మేమూ ప్రత్యామ్నాయమే: అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

  • వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామన్న ఒవైసీ
  • ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామని వెల్లడి
  • ముస్లింలకూ ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్
asaduddin owaisi interesting comments over mim contest in telangana

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఫిర్యాదుతో అరెస్టయిన మజ్లిస్‌ నేతలను ఈ రోజు నిజామాబాద్‌ జిల్లా జైలులో ఆయన కలిశారు.

అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో పోటీ చేస్తాం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌కు తగిన బుద్ధి చెబుతాం” అని హెచ్చరించారు. అరెస్ట్‌ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత.. షకీల్‌ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. 

తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. 

‘‘ఎంఐఎం బలపడటం కోసం పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు తీసుకోవాలి.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు” అని అన్నారు.

More Telugu News