Gudivada Amarnath: నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే సీఎం కాలేరు: పవన్‌పై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు

Minister Gudivada Amarnath Satires On Pawan Kalyan CM Comments
  • ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని తిడితేనో సీఎం కాలేరన్న అమర్నాథ్
  • ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో ఆయనకు జ్ఞానోదయమైందని ఎద్దేవా
  • పవన్ ఫ్యాన్సే ఆయనకు ఓటు వేయరని, మిగతా హీరోల ఫ్యాన్స్ ఎలా వేస్తారని ప్రశ్న
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటే తాను ఇంకో మూడు పెళ్లిళ్లు చేసుకుంటానన్నారు.

ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? ఇవన్నీ కాదు కదా.. ఒక లీడర్‌‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలి” అని అన్నారు.

 ‘‘అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చరిష్మా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి.. అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే.. దానికి అనేక రకాల దారులు ఉన్నాయి. డెడికేషన్ ఉండుంటే.. కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో” అని చెప్పారు. 

‘‘ప్రత్తిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు.. పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రిని చేయమని అంటారు.. ముమ్మిడివరం వచ్చి ఈ సారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటారు” అని ఎద్దేవా చేశారు. పవన్ ఫ్యాన్సే ఆయనకు ఓటు వేయరని, ఇక మిగతా హీరోల ఫ్యాన్స్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. 
Gudivada Amarnath
Pawan Kalyan
Janasena
CM Comments
YSRCP

More Telugu News