Murali Mohan: ఆ ఒక్క సినిమా అంచనాలు తలక్రిందులు చేసింది: మురళీమోహన్

  • నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న మురళీ మోహన్ 
  • 300లకి పైగా సినిమాలు చేసిన అనుభవం 
  • 'ముద్దబంతి' సినిమాను గురించిన ప్రస్తావన 
  • తనని ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకోలేదని వెల్లడి  
Murali Mohan Interview

తెలుగు సినిమాల్లో హీరోల మధ్య గట్టిపోటీ ఉన్న సమయంలో మురళీ మోహన్ ఎంట్రీ ఇచ్చారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ .. "1973లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. సోలో హీరోగా ఓ 150 సినిమాలు చేశాను .. సెకండ్ హీరోగా ఓ 100 సినిమాలు చేశాను .. ఓ 50 సినిమాల వరకూ కేరక్టర్ ఆర్టిస్టుగా చేశాను" అని అన్నారు. 

"నటుడిగా నేను యావరేజ్ స్టూడెంట్ ను అనే చెప్పుకుంటాను. నాకు అద్భుతమైన పర్సనాలిటీ లేదు .. పెద్ద అందగాడిని కాదు. నాకంటే టాలెంట్ ఉన్నవాళ్లు .. అందగాళ్లు బయట చాలామందే ఉన్నారు. కాకపోతే భగవంతుడు నాకున్న టాలెంట్ కంటే ఎక్కువగానే అవకాశం .. అదృష్టం ఇచ్చాడంతే. నేను చేసిన వాటిలో ఒక సినిమా నా అంచనాలను తలక్రిందులు చేసింది" అని చెప్పారు. 

"దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో నేను 'ముద్దబంతి' అని ఒక సినిమా చేశాను. "ఈ సినిమాతో నీకు చాలా మంచి పేరు వస్తుంది .. నీ రేంజ్ పెరిగిపోవడం ఖాయం" అని దాసరిగారు నాతో అనేవారు. ఆయనతో కలిసి ఆ సినిమాను నేను విజయవాడలో చూశాను. ఇంటర్వెల్ దాటగానే నేను తాగుబోతుగా కనిపిస్తాను. అదే ఈ సినిమాకి మైనస్ అయింది. అలాంటి  సీన్స్ ను ఏఎన్నార్ తప్ప ఎవరూ చేయలేరనేది ఆడియన్స్ అభిప్రాయం. అనుకున్నట్టుగానే సెకండాఫ్ బాగోలేదనే టాక్ వచ్చింది .. సినిమా ఫ్లాప్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News