Adipurush: ప్రత్యేక ఆఫర్లతో పెరిగిన 'ఆదిపురుష్' కలెక్షన్లు.. 10 రోజల కలెక్షన్లు ఇవే!

  • టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను సాధిస్తున్న 'ఆదిపురుష్'
  • ఇప్పటి వరకు రూ. 450 కోట్ల వరకు గ్రాస్ వసూలు
  • నిన్న రూ. 6 కోట్ల వసూళ్లను సాధించిన వైనం
Adipurush 10 days collections

టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. వెల్లువెత్తుతున్న విమర్శల మధ్యే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వీకెండ్ కలెక్షన్లు తగ్గినప్పటికీ నిన్న మరో రూ. 6 కోట్ల వసూళ్లను సాధించింది. విడుదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందా? లేదా? అనేది ఈ వారంలో తేలిపోనుంది. 

మరోవైపు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఈ మూవీ మేకర్స్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. 3డీ టికెట్ ప్రారంభ ధరను రూ. 112కి తగ్గించారు. ఈరోజు నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే టికెట్ ధరను రెండు సార్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

More Telugu News