BJP: ఆందోళన విరమించిన రెజ్లర్లు.. కోర్టులోనే తేల్చుకుంటామన్న సాక్షి మాలిక్

  • బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు
  • అరెస్ట్ చేయాలంటూ ఐదు నెలలుగా రెజ్లర్ల ఆందోళన
  • చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్టు చెప్పిన సాక్షి
Top Wrestlers call off protest after 5 months

బీజేపీ నేత, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఐదు నెలలుగా చేస్తున్న ఆందోళనను రెజర్లు విరమించారు. ఇకపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రెజ్లర్ సాక్షిమాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోర్టులో యుద్ధం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఈ నెల 15న బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆందోళన విరమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

కాగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తాత్కాలిక ప్యానెల్, క్రీడా మంత్రిత్వశాఖ, డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఏ) దాఖలు చేసిన ఫిటిషన్‌ను ఆదివారం విచారించిన గువాహటి హైకోర్టు రెజ్లింగ్ బాడీ ఎన్నికలపై స్టే విధించింది.

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ మైనర్ సహా టాప్ ఒలింపియన్స్ అయిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆందోళనకు దిగారు. అయితే,  ఈ ఆరోపణలను సింగ్ కొట్టిపడేశారు.

More Telugu News