Suraj: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కన్నడ నటుడు సూరజ్.. కుడికాలు తీసేయాలన్న వైద్యులు

Actor Suraj Injured In Road Accident In Karnataka
  • బైక్‌పై వస్తున్న సూరజ్‌ను ఢీకొట్టిన టిప్పర్ లారీ
  • కుడికాలికి తీవ్ర గాయం
  • ఆసుపత్రికి వెళ్లిన నటుడు శివరాజ్‌కుమార్, ఆయన భార్య గీత, డైరెక్టర్ చిన్నెగౌడ
కన్నడ నిర్మాత, దివంగత పర్వతమ్మ రాజ్‌కుమార్ మేనల్లుడు, ప్రముఖ నటుడు సూరజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుడికాలికి తీవ్ర గాయం కావడంతో దానిని తొలగించాలని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. మైసూరులోని సరస్వతీపురంలో ఉంటున్న సూరజ్ శనివారం సాయంత్రం బైక్‌పై ఒంటరిగా తమిళనాడు వెళ్లి వస్తుండగా చామరాజ్‌నగర్ జిల్లాలోని బెగుర్ హొబ్లిలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూరజ్‌ను వెంటనే మైసూరు ఆసుపత్రికి తరలించారు. కుడికాలికి తీవ్ర గాయం కావడంతో పరిశీలించిన వైద్యులు కాలును తొలగించాలని చెప్పినట్టు సమాచారం. 24 ఏళ్ల సూరజ్ పర్వతమ్మ రాజ్‌కుమార్ తమ్ముడు ఎస్ఏ శ్రీనివాస్ కుమారుడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న నటుడు శివరాజ్‌కుమార్, ఆయన భార్య గీత, డైరెక్టర్ చిన్నెగౌడ, బంధువులు ఆసుపత్రిని సందర్శించి సూరజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
Suraj
Kannada Actor
Road Accident
Mysore

More Telugu News