Infosys: విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Infosys center in Visakha will be inaugurated on June 28
  • రుషికొండలో ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్
  • నిర్మాణం పూర్తి చేసుకున్న భారీ భవనం
  • ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇక విశాఖ నుంచి కార్యకలాపాలు కొనసాగించనుంది. విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ పార్క్ హిల్ నెం.2లో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో, విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న విశాఖలో ఇన్ఫోసిస్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 

ఇన్ఫోసిస్ సంస్థ విశాఖలో శాటిలైట్ ఆఫీసు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, దాన్ని ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ గా అభివృద్ధి చేసింది. మొదటి విడతలో 650 మందితో ఐటీ సేవలకు శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే దీన్ని 1000 మంది సామర్థ్యంతో నడిచేలా విస్తరించనున్నారు.

  • Loading...

More Telugu News