APPCC Chief: సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవికి కాంగ్రెస్ నేతల వార్నింగ్

APPCC Chief Gidugu Rudra Raju Slams Ram Gopal Varma Vyooham teaser
  • వ్యూహం సినిమా టీజర్ పై మండిపడ్డ ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
  • సంచలనం కోసం లేనివి ఉన్నట్లుగా చూపిస్తే ఊరుకోబోమని వార్నింగ్
  • ఏపీ రాజకీయాలే లక్ష్యంగా రెండు భాగాలుగా రూపొందుతున్న ‘వ్యూహం’ మూవీ
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ టీజర్ తో మరో సంచలనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ టీజర్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చూపిస్తాడంటూ ఆర్జీవిపై ఫైర్ అయ్యారు. సంచలనాల కోసం ఈ సినిమాలో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని కించపరిచేలా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్జీవికి వార్నింగ్ ఇచ్చారు.

సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ, నెహ్రూల కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యూహం టీజర్ విడుదల తర్వాత ఆర్జీవీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అప్పటి కాంగ్రెస్‌ అధిష్ఠానం, జగన్‌ను బెదిరించినట్లు ఈ టీజర్‌లో చూపించారు. అంతేకాదు.. జగన్‌ తలొగ్గకపోవడంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్‌లో చూపారు. ఏపీ రాజకీయాలే లక్ష్యంగా రెండు భాగాలుగా ‘వ్యూహం’ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు.
APPCC Chief
Gidugu Rudra Raju
Ram Gopal Varma
Vyooham teaser
Sonia Gandhi

More Telugu News