Pawan Kalyan: ‘ఓజీ’ మామూలుగా ఉండదట!

  • ‘ఓజీ’లో పవన్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయన్న అర్జున్ దాస్
  • త్వరలోనే అగ్ని తుపాను రాబోతోందని వ్యాఖ్య
  • ఈ చిత్రం కథ చాలా కొత్తగా ఉందన్న శ్రియారెడ్డి
  • ఇందులో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారంటూ వార్త చక్కర్లు
actors commenting on pawan kalyans og movie

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని నటీనటులు చెబుతున్న మాటలు ‘ఓజీ’పై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కోలీవుడ్‌ నటుడు అర్జున్‌ దాస్‌ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సినిమాలో పవన్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ చూపించారు. అద్భుతంగా ఉన్నాయి. అలాగే పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌, డైలాగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి” అని పేర్కొన్నాడు. పవన్ అభిమానులంతా సిద్ధంగా ఉండాలని, త్వరలోనే అగ్ని తుపాను రానుందని అంచనాలను పెంచేశాడు.

మరో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి.. మాట్లాడుతూ ‘‘మొదట ఈ సినిమాలో ఆఫర్‌ వచ్చినప్పుడు కమర్షియల్‌ స్టోరీ ఏమో అనుకున్నా. విని నో చెప్పేద్దామని అనుకున్నా. కానీ సుజిత్‌ కథ చెప్పిన 5 నిమిషాల్లోనే ఓకే చెప్పేశా. నాకు ఆ కథ అంత నచ్చింది. చాలా కొత్తగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న మరో వార్త ఒక ఎత్తు. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు తండ్రి పాత్రలో బిగ్‌బీ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News