బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
- ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురు గాలులు
- సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దు..
- మత్స్యకారులకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వార్నింగ్
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉందని, చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.