Vijayawada: విజయవాడలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

Woman murdered in Vijayawada city outskrits
  • నాగమణి రెండో కూతురుతో అల్లుడికి విభేదాలు
  • కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో మాట్లాడుదామని అత్త, మామను ఫ్లైఓవర్ వద్దకు రమ్మని పిలుపు
  • రాగానే కత్తితో దాడి చేసిన అల్లుడు
  • పరారైన మామ, అత్తపై విచక్షణారహితంగా కత్తితో దాడి

విజయవాడ శివారులో నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జక్కంపూడికి చెందిన నాగమణి రెండో కూతురుతో అల్లుడికి విబేధాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కోర్టులో కేసు పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేశ్ పథకం ప్రకారం వారితో మాట్లాడాలని ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిచాడు. వారు అక్కడకు రాగానే బైక్ పై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా ఆయన పారిపోయాడు. 

అనంతరం రాజేశ్ అత్తపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి మృతి చెందింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News