Madhu Yaskhi: పొంగులేటి, షర్మిల చేరిక ఊహాగానాలపై మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్

  • పొంగులేటి వస్తే లాభం.. షర్మిల వస్తే మంచిదన్న యాష్కీ
  • స్థానిక నేతలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచన
  • బీసీలకు ప్రాధాన్యత ఇస్తే గెలవడం సులభమని వ్యాఖ్య
Madhu Yashki interesting comments on Ponguleti and Sharmila joining congress

కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తే లాభమేనని మాజీ ఎంపీ, ఆ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వచ్చినా మంచిదే అన్నారు. అయితే కొత్త వారు వచ్చినప్పుడు పార్టీ స్థానిక నేతలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం సులభమన్నారు. కానీ కొత్తవారితోనే పార్టీ గెలుస్తుందని భావిస్తే మాత్రం పొరపాటు అన్నారు. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు మాజీ సీఎంలు పార్టీలో చేరారని, కానీ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. వచ్చే నేతలు ఎంత సమర్థులో మనం చూసుకోవాల్సి ఉందన్నారు. పార్టీలో చేరేవారు కాంట్రాక్టుల కోసం వస్తున్నారా? లేక పార్టీ కోసం వస్తున్నారా? అనేది తేలాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

More Telugu News