వివేకా హత్య కేసులో ఉన్న అనుమానాలపై ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ!
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి
- నేడు మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న అవినాశ్
వివేకా హత్య కేసులో అవినాశ్ ఇప్పటికే అనేక పర్యాయాలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఓ దశలో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతోందని ప్రచారం జరిగింది. అయితే, అనేక నాటకీయ పరిణామాల మధ్య అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.