Vladimir Putin: రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు వస్తాడన్న వాగ్నర్ గ్రూప్ అధిపతి

  • పుతిన్ తమ విషయంలో పొరబడ్డారని, తాము దేశభక్తులమన్న ప్రిగోజిన్
  • ఏ ఒక్కరు కూడా లొంగిపోవడం లేదని వెల్లడి
  • పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణ
Putin made mistake Russia will soon have new president

వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ రష్యా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అధ్యక్షుడు పుతిన్ నిప్పులు చెరిగారు. తమ విషయంలో పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని ప్రిగోజిన్ అన్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిపారు. 

తాము ఎవరికీ ద్రోహం చేయలేదని, అధ్యక్షుడు పొరబడ్డారన్నాడు. ఏ ఒక్కరు కూడా లొంగిపోవడం లేదని, ఎందుకంటే తాము ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదన్నారు. పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

More Telugu News