Gandra Venkata Ramana Reddy: ఈటల ఓడిపోవడం ఖాయం: గండ్ర వెంకటరమణారెడ్డి

Etela will loose election says Gandra Venkara Ramana Reddy
  • బీఆర్ఎస్ 100కు పైగా స్థానాల్లో గెలిచి ఘన విజయం సాధిస్తుందన్న గండ్ర 
  • మోదీని మించిన మోసగాడు మరెవరూ లేరని విమర్శ
  • హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ఈటల బహిరంగ చర్చకు రావాలని సవాల్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 100కు పైగా స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని, అయినప్పటికీ వారి కలలు నెరవేరడం లేదని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీని మించిన మోసగాడు మరెవరూ లేరని చెప్పారు. 

సింగరేణిని ప్రైవేటీకరించబోమని గతంలో మోదీ చెప్పారని... ఈ ప్రకటన చేసిన కొద్ది కాలంలోనే బొగ్గు బ్లాకుల వేలం కోసం టెండర్ ప్రక్రియను ప్రారంభించారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం సరికాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చేసిందేమీ లేదని విమర్శించారు. హుజారాబాద్ నియోజవర్గ అభివృద్ధిపై ఈటల బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Gandra Venkata Ramana Reddy
BRS
Narendra Modi
Etela Rajender
BJP

More Telugu News