Amit Shah: అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన అలా ఊహించుకుంటారా?: సోము

Somu Veerraju on chandrababu meeting with Amith Shah
  • రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు
  • బాబు-అమిత్ షా భేటీని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారని వ్యాఖ్య
  • మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోందన్న సోము
నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై అడగ్గా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసినంత మాత్రాన అలా ఊహించుకుంటారా? అని ప్రశ్నించారు.

వీరిద్దరి భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారన్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. ఏపీకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనేది తన ఆకాంక్ష అని, ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ చేసిన అభివృద్ధి, సంక్షేమం అందరికీ కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ ఏం చేసిందో ప్రజలకు కూడా తెలుసునని చెప్పారు.
Amit Shah
Chandrababu
BJP
Telugudesam

More Telugu News