Komatireddy Raj Gopal Reddy: బీజేపీలోనే ఉన్నా.. హైకమాండ్‌కు నా అభిప్రాయాన్ని వివరిస్తా: రాజగోపాల్ రెడ్డి

  • పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దన్న రాజగోపాల్ రెడ్డి 
  • ఈ విషయాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని వ్యాఖ్య 
  • ప్రజల్లో ఉన్న అపోహలను పార్టీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి
currently i am in bjp says komatireddy rajagopal reddy on party change issue

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. బీజేపీలోనే ఉన్నానని, ఊహాగానాలు నమ్మవద్దని కోరారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని అన్నారు. 


ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగే సమావేశంలో తన అభిప్రాయాన్ని వివరిస్తానని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను పార్టీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. 

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోందని వివరించారు.

More Telugu News