AliExpress: ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు వచ్చిన పార్శిల్

  • చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ పై 2019లో ఆర్డర్
  • ఇటీవలే ఇంటికి డెలివరీ చేసిన సంస్థ
  • ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ కు ఎదురైన అనుభవం
Delhi man orders product from AliExpress receives it after 4 years

ఆన్ లైన్ లో ఏదైనా కొంటే, సాధారణంగా ఒక వారంలో ఇంటికి డెలివరీ చేస్తారు. మహా అయితే 10 రోజులు పడుతుంది. అంతకు మించి సమయం తీసుకోరు. కానీ, ఇక్కడ ఓ వినియోగదారుడి అనుభవం వేరు. ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి చేరేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. 

చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ప్రస్తుతం మన దేశంలో నిషేధిత జాబితాలో ఉంది. దీంతో ఇది పనిచేయడం లేదు. కాకపోతే కొంత కాలం క్రితం వరకు ఇది కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నదే. చౌక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా ఉండడంతో భారత్ నుంచి పెద్ద మొత్తంలో  కొనుగోలు చేసేవారు. దీంతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్ లో ఒక వస్తువు కోసం ఆర్డర్ చేశాడు. అది కూడా కోవిడ్ ముందు. కానీ ఎన్ని రోజులు గడిచినా పార్సిల్ డెలివరీ కాలేదు.

2019లో అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్ పై తాను ఆర్డర్ చేయగా, అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఇటీవలే డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ వివరాలు వెల్లడించాడు. ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ సందేశం ఇచ్చాడు. అలీ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలో నిషేధించకపూర్వం దానిపై ఆర్డర్ చేసినట్టు తెలిపాడు.

More Telugu News