Andhra Pradesh: అంతర్వేదిలో జాలరికి చిక్కిన అరుదైన చేప

  • నాలుగు కిలోల కచిడీ చేపకు రూ.16 వేలు
  • వారం సంపాదన ఒక్క చేపతో వచ్చిందంటున్న జాలరి
  • మందుల తయారీలో ఉపయోగించడం వల్లే రేటు ఎక్కువట
Andhra Pradesh Fisherman Strikes Gold After 4 Kg Kachidi Fish Fetches Rs 16 Thousand

నదిలో చేపల వేట అదృష్టంపై ఆధారపడి ఉంటుందంటారు.. ఒక్కోసారి గంటల తరబడి కష్టపడ్డా ఖాళీ చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని మత్స్యకారులు కూడా వాపోతుంటారు. అయితే, అంతర్వేదిలో మాత్రం ఓ జాలరి ఖాళీ చేతులతోనే అరుదైన చేపను ఒడిసిపట్టుకున్నాడు. ఒడ్డుకు దగ్గర్లో నీటిపై తేలుతూ వెళుతున్న చేపను నదిలో దూకి పట్టేసుకున్నాడు. ఈ అరుదైన కచిడీ చేపను వేలం వేయగా.. రూ.16 వేలకు అమ్ముడు పోయిందట. దీంతో వారం రోజులు చేపల వేటలో కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క చేపతో వచ్చిందని ఆ జాలరి సంతోషం వ్యక్తం చేశాడు.

కోనసీమ జిల్లాలోని అంతర్వేది సాగర సంగమం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడికి అదృష్టం కలిసి వచ్చింది. వశిష్ఠ గోదావరిలో అరుదైన కచిడి చేప చిక్కింది. సుమారు 4 కిలోల బరువున్న కచిడీ చేపను ఒడ్డుకు చేర్చిన మత్సకారుడు.. దానిని వేలం వేయగా పదహారు వేలకు అమ్ముడు పోయింది. ఈ చేపలను మందుల తయారీలో వాడతారని, బరువును బట్టి ఇవి ధర పలుకుతాయని జాలర్లు చెప్పారు. గోల్డ్ ఫిష్ గా వ్యవహరించే ఈ మగ కచిడి చేపకు డిమాండ్ ఎక్కువని వివరించారు. ఈ రకం చేపలు ఎక్కువగా కాకినాడ, అంతర్వేది దగ్గరలోనే దొరుకుతాయని చెప్పారు.

More Telugu News