TTD: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత చిక్కింది

  • నిలకడగానే బాలుడి ఆరోగ్యం
  • గత రాత్రి బోనులో పడిన చిరుత
  • ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం
Tiger which attacked 3 year boy caught

రెండు రోజుల క్రితం తిరుమల నడక దారిలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు. దానిని పట్టుకునేందుకు  అధికారులు నిన్న రెండు బోన్లు ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడింది.

చిరుత దాడిలో గాయపడిన బాలుడిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ (3)గా గుర్తించారు. వెంటనే బాలుడుని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చిరుత దాడి నేపథ్యంలో నడక మార్గంలో ఇకపై భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

More Telugu News