Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై బీజేపీ కార్యాలయం ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీ

BJPs Devdas Jibe At Rahul Gandhi in patna
  • ప్రతిపక్షాల సమావేశానికి ముందు దేవదాస్ ఫ్లెక్సీ
  • షారుక్ ఖాన్ రీల్ లైఫ్, రాహుల్ గాంధీ నిజజీవితంలో దేవదాస్ అంటూ వ్యాఖ్యలు
  • రాజకీయాలను వీడాలని అందరూ అడిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ విమర్శ
పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పదిహేను పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడి బీజేపీ కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీపై ఆసక్తికర ఫ్లెక్సీ వెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజజీవితంలో దేవదాస్ అంటూ అందులో పేర్కొన్నారు.

మమతా బెనర్జీ బెంగాల్ ను, కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలను, లాలు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లు బీహార్ ను, అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ను, స్టాలిన్ తమిళనాడును, రాహుల్ గాంధీ రాజకీయాలను వీడాలని అందరూ కాంగ్రెస్ ను అడిగే రోజు ఎంతో దూరంలో లేదని, షారుక్ ఖాన్ రీల్ దేవదాసు అయితే, రాహుల్ రియల్ లైఫ్ దేవదాస్ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
Rahul Gandhi
BJP
Congress

More Telugu News