couple: నడుస్తున్న బైక్ పై జంట రొమాన్స్.. భారీ జరిమానా

Ghaziabad police reacts to couple romance on moving bike
  • హెల్మెట్లు లేకుండా ప్రమాదకర విన్యాసం
  • వెనుక కారులో వస్తున్న వ్యక్తి ఫోన్ లో చిత్రీకరణ
  • దీనిపై రూ.21,000 జరిమానా విధించిన పోలీసులు
ఢిల్లీ మెట్రో కోచ్ లో ఓపెన్ గా ఓ యువతీ, యువకుడు రొమాన్స్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరడం మర్చిపోక ముందే.. మరో జంట నడిరోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ఓ జంట బైక్ పై రొమాన్స్ చేసుకుంటూ రివ్వున సాగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించారు.

ఓ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడ్ని కౌగిలించుకుని ఓ యువతి ముందు భాగంలో కూర్చుంది. దీంతో నిదానంగా వెళుతున్నారా? అంటే అదీ లేదు. వేగంగా దూసుకుపోతున్నారు. పైగా ఇద్దరికీ హెల్మెట్లు లేవు. వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఓ వ్యక్తి షూట్ చేశారు. జాతీయ రహదారి9పై ఇందిరాపురం పరిధిలో ఇది జరిగింది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. ‘‘ట్విట్టర్ నుంచి అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నాం. చలానా జారీ చేశాం’’ అని ప్రకటించారు. వాహన దారుడికి రూ.21,000 చలానా విధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పోలీసులు షేర్ చేశారు.
couple
romance
moving bike
Ghaziabad
police
challan

More Telugu News