Tata Nexon: 70 కిలోమీటర్ల వేగంతో ఎద్దును ఢీకొన్న నెక్సాన్.. తర్వాత ఏమైందంటే..!

  • నెక్సాన్ ముందు భాగం నుజ్జు నుజ్జు
  • కారులోని వారు సురక్షితం
  • కారు బలంగా ఢీకొన్నా లేచి పరుగుపెట్టిన ఎద్దు
Tata Nexon hits bull at very speed but bull survived

టాటా నెక్సాన్ ఎస్ యూవీ మన దేశంలోనే సురక్షితమైన కార్లలో ఒకటి. అంతేకాదు గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో భారత్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన ఏకైక కారు ఇది. అంటే ప్రమాదం జరిగినప్పుడు అందులోని వారికి రక్షణ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో నెక్సాన్ మోడల్ అంతగా పాప్యులర్ అవ్వడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. 

నెక్సాన్ ఎస్ యూవీ ప్రమాదానికి గురైన ఘటనల వీడియోలు యూట్యూబులో బోలెడు కనిపిస్తాయి. వాటిల్లో కారుకు డ్యామేజ్ కావడమే కానీ, అందులోని వారు సురక్షితంగా బయటపడిన ఘటనలే ఎక్కువ. నెక్సాన్ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రాత్రి సమయం కావడంతో వీధి లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ఎద్దు కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో ఆ ఎద్దుని నెక్సాన్ గట్టిగా ఢీకొంది. ఈ దెబ్బకు బిత్తరపోయిన నెక్సాన్ డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. కారు అంత వేగంగా, బలంగా ఢీకొన్నా, ఎద్దు మాత్రం గెంతుతూ అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. 

డ్రైవర్ కారు దిగి చూసుకోగా.. ముందు బ్యానెట్ భాగంలో డ్యామేజ్ అయింది. నిఖిల్ రాణా అనే యూట్యూబర్ ఈ వీడియోను షేర్ చేశారు. టాటా నెక్సాన్ కారులోని డ్యాష్ బోర్డ్ కెమెరా దీన్ని రికార్డు చేసింది. కారులోని వారికి ఏమీ కాలేదు. 

More Telugu News