ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం.. కుప్వారాలో మరో నలుగురు ఉగ్రవాదుల హతం
- కుప్వారాలో మరో భారీ ఎన్కౌంటర్
- పీవోకే వైపు నుంచి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం
- కాల్చి చంపిన భద్రతా బలగాలు
నియంత్రణ రేఖ సమీపం కుప్వారాలోని మచల్ సెక్టార్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను చూసిన భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు ప్రారంభించాయి. ఎదురుదాడికి దిగిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ నెల 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.