Narendra Modi: వైట్‌ హౌస్‌లో ప్రధాని మోదీకి అధికారిక విందు.. పలువురు భారతీయ ప్రముఖుల హాజరు

Modi attends state dinner at white house hosted by president biden
  • ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా సహా పలువురు భారత ప్రముఖుల హాజరు
  • వైట్‌హౌస్‌లో దక్షిణాదిన ఉన్న లాన్‌లో విందు ఏర్పాటు
  • ఆహూతుల కోసం విభిన్నమైన శాకాహార వంటకాలను సిద్ధం చేసిన శ్వేతసౌధం
  • చిరుధాన్యాల వంటకాలనూ సిద్ధం చేసిన వైనం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటూ ఇతర భారతీయ ప్రముఖులతో కలిపి మొత్తం 400 మంది అతిథులు ఈ విందులో పాలుపంచుకున్నారు. 

బిలియనీర్ ముఖశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబీ సీఈఓ శంతను నారాయణ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. 

శ్వేతసౌధంలో దక్షిణాదిన ఉన్న లాన్‌లో ఈ విందు జరిగింది. ప్రధాని కోసం విభిన్నమైన శాకాహార వంటకాలను వైట్‌హౌస్ సిద్ధం చేసింది. చిరు ధాన్యాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం తెచ్చేందుకు మోదీ కృషి చేస్తున్న నేపథ్యంలో విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలనూ చేర్చారు.

  • Loading...

More Telugu News