Train Accident: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

  • చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు 
  • రైలు చెన్నై నుండి ముంబై వెళుతుండగా ప్రమాదం 
  • ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Short circuit in coupler delays Chennai Mumbai express by an hour

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి హఠాత్తుగా మంటలు రావడం కలకలం రేపింది. చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బోగీల నుండి బయటకు పరుగు తీశారు. ఈ రైలు చెన్నై నుండి ముంబై వెళుతుండగా ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరిన అరగంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి నుండి రైలు గం.6.20కి బయలుదేరింది. గం.6.48 సమయంలో మంటలు వచ్చాయి. పలువురు ప్రయాణికులు మంటలు వస్తున్న దృశ్యాన్ని తమ ఫోన్ లలో బంధించారు. ఆ తర్వాత గం.7.15 నిమిషాలకు ఈ రైలు వ్యాసపార్ది జీవా స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది.

More Telugu News