titanic: టైటానిక్ శిథిలాల పక్కనే...: తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి గుర్తింపు!

Debris field found in Titan submersible search area
  • టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాల గుర్తింపు
  • టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్
  • శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడి
తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించనున్నారు. టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ కొన్ని టైటాన్ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. టైటానిక్ ఓడ శిథిలాల పక్కనే టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది.
titanic
submarine

More Telugu News