rbi: ద్రవ్యోల్బణం కట్టడిపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

Job half done as MPC focuses on 4 percent inflation target says RBI Governor Das
  • ద్రవ్యోల్బణం కట్టడిలో నిర్దేశించుకున్న లక్ష్యంలో సగమే పూర్తయిందని వ్యాఖ్య
  • దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు బలోపేతమవుతున్నాయన్న దాస్
  • బయటికొచ్చిన మానిటరీ పాలసీ కమిటీ మినిట్స్! 
ద్రవ్యోల్బణం కట్టడిలో నిర్దేశించుకున్న లక్ష్యంలో సగమే పూర్తయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇటీవల జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జూన్ ప్రారంభంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మినిట్స్ తాజాగా బయటకు వచ్చాయి. 

దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు బలోపేతమవుతున్నాయని, వృద్ధి అవకాశాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని దాస్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో పాటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యవంతంగా తయారయిందన్నారు. 

కానీ ద్రవ్యోల్బణం కట్టడిలో నిర్దేశిత స్థాయికి తీసుకు రావడంలో మన పని సగమే పూర్తయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్దిష్ట అంచనాకు రావడం కష్టంతో కూడుకున్న వ్యవహారంగా పేర్కొన్నారు.
rbi
mpc
india

More Telugu News