Janasena: అభివృద్ధిలో మీకంటే నేనే గొప్ప!: వైసీపీ ఎంపీకి జనసేన కార్పొరేటర్ సవాల్

Janasena corporator challenges YSRCP MP MVV
  • తనతో సమానంగా అభివృద్ధి చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్
  • విశాఖకు తెచ్చిన ఒక్క ముఖ్యమైన ప్రాజెక్టు పేరు చెప్పాలని నిలదీత
  • నేను వార్డులో చేసిన అభివృద్ధిలో సగమైనా విశాఖలో చేశారా? అని ప్రశ్న
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గురువారం సవాల్ విసిరారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తనతో సమానంగా ఎంపీ అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానన్నారు. ఎంపీ కబ్జాలు, అక్రమాలు, సొంత ఆస్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తే... తాను మాత్రం వార్డులో అభివృద్ధి పనులు, ప్రజాసేవ చేశానన్నారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు రావాలన్నారు. విశాఖ ఎంపీగా ఉంటూ ఎంవీవీ తెచ్చిన ఒక్క చెప్పుకోదగిన ప్రాజెక్టు పేరు చెప్పాలన్నారు. 22వ వార్డులో తాను చేసిన అభివృద్ధిలో సగమైనా విశాఖ లోకసభ పరిధిలో చేశారా? అనేది నిరూపించాలన్నారు.

సాటి ఎంపీలను, ప్రజాప్రతినిధులను కుక్కలుగా పోల్చిన ఎంవీవీ స్థాయి ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన ఎంపీ అయ్యాక విశాఖ నగర రహదారులు కనీస మరమ్మతుకు నోచుకోలేదని, కానీ ఎంవీవీ సిటీకి రెండువైపులా విశాలమైన రహదారులు వేయించారన్నారు. తన వెంచర్ల చుట్టూ రోడ్ల కోసం నగరపాలక సంస్థ నుండి కోట్లాది రూపాయల నిధులు పొందడం భారీ కుంభకోణమన్నారు. పేద వృద్ధులకు కేటాయించిన పదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొట్టేశారని ఆరోపించారు. సీబీసీఎంసీ భూములను కూడా కబ్జా చేశారన్నారు.

Janasena
YSRCP

More Telugu News