gdp: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్ రేటింగ్స్

  • జీడీపీ వృద్ధి రేటు సవరించిన ఫిచ్
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుండి 6.3 శాతానికి పెంపు
  • మొదటి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి, స్వల్పకాలంలో వృద్ధికి అవకాశాల నేపథ్యంలో సవరణ
  • ఆటో సేల్స్, పీఏఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడి
Fitch raises India FY24 GDP forecast

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ సవరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం వృద్ధి నమోదవుతుందని గతంలో అంచనా వేసింది. తాజాగా దీనిని 6.3 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి, స్వల్పకాలంలో వృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో సవరించినట్లు తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 9.1 శాతం నమోదయింది.

ఈ ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంలో అంచనాలకు మించి భారత జీడీపీ 6.1 శాతం నమోదు చేసినట్లు ఫిచ్ తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు, పీఏఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను పెంచుతున్నట్లు ఫిచ్ తెలిపింది.

More Telugu News