: చేపమందు పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానం ఇవ్వొద్దు: లోకాయుక్త

చేపమందు పంపిణీ కార్యక్రమం నిర్వహణ కోసం ఎగ్జిబిషన్ మైదానం ఇవ్వొద్దని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ కార్యదర్శిని లోకాయుక్త ఆదేశించింది. ప్రైవేటు కార్యక్రమానికి ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని స్పష్టం చేసింది. ఈ రోజు లోకాయుక్త కార్యాలయంలో జరిగిన విచారణకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ కార్యదర్శితో పాటు, నగర పోలీస్ కమిషనర్ హాజరై వివరణ ఇచ్చారు. చేపమందు పంపిణీకి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే భ్రదత కల్పిస్తున్నామని లోకాయుక్తకు తెలిపినట్లు అనంతరం కమిషనర్ అనురాగశర్మ మీడియాకు చెప్పారు.

More Telugu News