Most Livable Cities: నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ కు లేని చోటు!

  • ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా వియెన్నా
  • తర్వాతి స్థానాల్లో కోపెన్ హాగెన్, మెల్ బోర్న్
  • 141వ స్థానంలో ఢిల్లీ, ముంబై
No place for Hyderabad in most livable cities list

ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియెన్నా నిలిచింది. రెండో స్థానంలో డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీలు నిలిచాయి. ఈ జాబితాను 'ది ఎకనామిస్ట్'కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసింది. ఈ జాబితాలో 173 దేశాల పేర్లు ఉన్నాయి. హెల్త్ కేర్, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణం తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. టాప్ 10 నగరాల్లో కెనడాకు చెందిన 3 నగరాలు కల్గరీ, వాంకోవర్, టొరంటో ఉన్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన జూరిచ్, జెనీవా కూడా స్థానం దక్కించుకున్నాయి. 

మన దేశం విషయానికి వస్తే జాబితాలో బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలు 141వ స్థానంలో, చెన్నై 144వ స్థానంలో, అహ్మదాబాద్, బెంగళూరు సిటీలు 147, 148 స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మన గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు చోటు దక్కకపోవడం గమనార్హం.

More Telugu News