విశ్వసముద్ర బయో ఎనర్జీ పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
- మూడు కంపెనీల నిర్మాణ పనులకు శిలాఫలకం ఆవిష్కరణ
- ఓ కంపెనీకి ప్రారంభోత్సవం
- అన్నీ వర్చువల్ గా నిర్వహించిన సీఎం జగన్
సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ పరిశ్రమల విలువ రూ.1,425 కోట్లు అని, వీటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.