Roja: చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినండి: పవన్ కు రోజా సలహా

Roja suggests Pawan Kalyan to hear Chiranjeevi not Chandrababu
  • చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారన్న రోజా
  • పవన్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని వ్యాఖ్య
  • అంతు చూస్తానంటూ జనసేన కార్యకర్తలకు వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని అంటారని, మరో రోజు ఎమ్మెల్యే అవుతానని చెపుతారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలను తిట్టడానికే పార్టీని పెట్టారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని... చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని చెప్పారు. చంద్రబాబును నమ్మొద్దని 2013లోనే మీ అన్నయ్య చిరంజీవి చెప్పారని అన్నారు. చంద్రబాబు చెప్పింది వినొద్దని, చిరంజీవి చెప్పింది వినాలని హితవు పలికారు. 

చంద్రబాబు స్క్రిప్ట్ ను చదుపుతూ పవన్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని చెప్పారు. అందరూ గుంపుగా రాకపోతే 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని పవన్ అన్నారని... గుంపుగా వచ్చినా, ఎవరికి వారు సింగిల్ గా వచ్చినా మళ్లీ జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ జనసేన కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారని... మీ అంతు తేలుస్తానని హెచ్చరించారు. డెవిల్ ఈజ్ బ్యాక్ అని వార్నింగ్ ఇచ్చారు.
Roja
YSRCP
Jagan
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Chiranjeevi
Tollywood

More Telugu News