Prabhas: ప్రభాస్ కు విదేశాల్లో అత్యంత ఖరీదైన విల్లా.. ఎక్కడుందో తెలుసా?

Prabhas has costly villa in Italy
  • గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్
  • విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న యంగ్ రెబల్ స్టార్
  • ఇటలీలో అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ చేతి నిండా ఆఫర్లు ఉన్నాయి. ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి, వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. 

మరోవైపు ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారమవుతోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నాడనేదే ఆ వార్త. ముఖ్యంగా ఇటలీలో కాస్ట్లీ లొకాలిటీలో ప్రభాస్ కు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన విల్లా ఉందని జాతీయ మీడియాలో కథనం వచ్చింది. షూటింగ్ లు లేని సమయంలో ప్రభాస్ తనకు అత్యంత సన్నిహితులైన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్తుంటాడట. తాను బిజీగా ఉన్నప్పుడు విల్లాను ఖాళీగా ఉంచకుండా అద్దెకు ఇస్తున్నాడని, దీని వల్ల నెలకు రూ. 50 లక్షలకు పైగానే రెంట్ వస్తోందని సదరు కథనంలో పేర్కొన్నారు.
Prabhas
Villa
Bollywood
Tollywood

More Telugu News