USA: కోడి లేకుండానే చికెన్.. ఇకపై అమెరికాలో విక్రయాలు

A new era US gives green light to sale of countrys first lab grown chicken
  • రెండు సంస్థలకు అక్కడి నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు
  • జంతు కణాల వృద్ధి ద్వారా తయారు కానున్న చికెన్
  • ఇది సక్సెస్ అయితే జంతు వ్యర్థాల సమస్యకు పరిష్కారం
చికెనే కానీ కోడి నుంచి వచ్చింది కాదు. ల్యాబ్ లో తయారైంది. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించుకునేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్ డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేయడం ద్వారా ఈ చికెన్ ను ఉత్పత్తి చేస్తారు. తొలుత రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలు పెట్టి, తర్వాత సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంచనున్నారు. ఈ చికెన్ రుచిగా ఉండి, ఆహార ప్రియుల ఆదరణ చూరగొంటే జంతువులకు ప్రాణహాని తగ్గనుంది. 

దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. జంతువుల పెంపకం, వాటికి దాణా, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పెద్ద పరిష్కారం లభిస్తుంది. ‘‘జంతువుల కోసం దాణా తయారీకి ఎంతో నీటిని వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆహారం కోసం వధించాల్సి వస్తుంది. కానీ, దీన్నే మనం మరింత భిన్నంగా చేయొచ్చు’’ అని ఈట్ జస్ట్ కంపెనీ సీఈవో జాష్ టెట్రిక్ తెలిపారు.

ఈ సంస్థ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్ ను మార్కెట్ చేస్తోంది. ఈ సంస్థతోపాటు జోనిన్ బయోలాజిక్స్ కూడా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించనుంది. కృత్రిమంగా తయారు చేసిన చికెన్ ను గుడ్ మీట్ సంస్థ ఇప్పటికే సింగపూర్ లోనూ విక్రయిస్తోంది. ల్యాబ్ గ్రోన్ చికెన్ ను అనుమతించిన తొలి దేశం సింగపూర్.
USA
lab grown chicken
ALLOWED

More Telugu News