Narendra Modi: ప్రధాని మోదీపై ప్రముఖ హాలీవుడ్ స్టార్ ప్రశంసలు

Hollywood actor richard gare showers praises on Prime Minister narendra modi
  • అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు రిచర్డ్ గేర్
  • ప్రధాని ప్రసంగానికి ముగ్ధుడై ప్రశంసలు
  • భారత సంప్రదాయానికి మోదీ ప్రతిబింబమని వ్యాఖ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు మోదీ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. 

ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రిచర్డ్ గేర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుమునుపు, ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం, యోగా దినోత్సవంపై మీడియాతో తన మనసులో మాట పంచుకున్నారు. ‘‘ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశం. అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్‌ నుంచి మోదీ వచ్చారు. ఆయన భారత సంప్రదాయానికి ప్రతిబింబం. సోదర భావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశాన్ని మళ్లీ మళ్లీ వినాలని ఉంది’’ అని అన్నారు.
Narendra Modi
USA
Biden

More Telugu News