Tamil Nadu: తమిళనాడులో 500 మద్యం దుకాణాల మూసివేత

  • సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని డీఎంకే ఎన్నికల సమయంలో హామీ
  • ముందుగా స్కూల్స్, దేవాలయాల సమీపంలోని దుకాణాల మూసివేత
  • జూన్ 22 నుండి వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటన
Tamil Nadu Shuts 500 Liquor Shops As Part Of Phased Prohibition

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ బుధవారం వెల్లడించింది. తొలి విడతలో స్కూల్స్, ఆలయాల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. సంపూర్ణ మద్య నిషేధాన్ని క్రమంగా అమలు చేస్తామని డీఎంకే ఎన్నికలకు ముందు ప్రకటించింది. స్టాలిన్ అధికారంలోకి వచ్చాక వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యం విధానంలో కీలక మార్పులు చేశారు.

తమిళనాడు వ్యాప్తంగా మార్చి 31 నాటికి 5329 రిటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 500 దుకాణాలను మూసివేస్తున్నట్టు ఏప్రిల్ 12న మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఏప్రిల్ 20న జీవో జారీ చేశారు. ఈ జీవో ఆధారంగా 500 రిటైల్ మద్యం దుకాణాలను గుర్తించి జూన్ 22 నుండి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

More Telugu News