Telangana: ఇల్లు మహిళ పేరుమీదే ఉండాలి: తెలంగాణ రాష్ట్ర గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు

  • లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు
  • లబ్ధిదారుల ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగో ఏర్పాటు
  • ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలి
Gruhalaxmi scheme guidelines released

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 25ని విడుదల చేసింది. మహిళల పేరు మీద ఇల్లు మంజూరు చేయనుంది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు స్వీకరిస్తారు. సంబంధిత కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలి. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్లు పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికలో స్క్రూటినీ చేసి, లబ్ధిదారులను కలెక్టర్లు ఎంపిక చేస్తారు.

సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్లు ఇస్తారు. దీంతో మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. వీటికి రూ.7,350 కోట్లు ఖర్చు చేయనుంది. 

గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ తో పాటు, మొబైల్ యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మూడు దశల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవల్, స్టేజ్ రూఫ్ తో పాటు పనులు పూర్తయ్యాక మొత్తం అమౌంట్ చెల్లిస్తారు. ప్రభుత్వం తొలుత రూ.1 లక్ష ఇస్తుంది.

More Telugu News