Dhanush: బాలీవుడ్ లో ధనుష్ మరో సినిమా.. టైటిల్ ఇదే!

  • ధనుష్ హీరోగా రూపొందుతున్న హిందీ సినిమా ‘తేరే ఇష్క్‌ మే’
  • ఆనంద్‌ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • టైటిల్ తెలియజేసేందుకు వీడియోను విడుదల చేసిన మేకర్స్
dhanush new movie tere ishk mein title announcement

తమిళ హీరో ధనుష్ అన్ని చిత్రసీమల్లోనూ అడుగు పెట్టేస్తున్నాడు. కోలివుడ్ నుంచి బాలీవుడ్ కి.. అటు నుంచి నేరుగా హాలీవుడ్ కి వెళ్లాడు. మధ్యలో ఈ మధ్య ‘సార్’ సినిమాతో టాలీవుడ్ ని టచ్ చేశాడు. తాజాగా మరోసారి బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు.

ఆనంద్‌ ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా రూపొందిన బాలీవుడ్‌ చిత్రానికి ‘తేరే ఇష్క్‌ మే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలిపేందుకు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గడ్డంతో మాస్‌ లుక్‌లో ధనుష్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గతంలో ధనుష్ మూడు బాలీవుడ్ సినిమాలో చేయగా.. అందులో రెండు సినిమాలు ఆనంద్ ఎల్.రాజ్ దర్శకత్వం వహించినవే. 2013లో రాంజానా సినిమాతో బాలీవుడ్ లో ధనుష్ అరంగేట్రం చేశాడు. 2021లో ఆత్రంగీ రే చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు.

More Telugu News