Ponnam Prabhakar: దున్నపోతులా బలిసి..: గంగుల కమలాకర్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్

former MP ponnam prabhakar fires on minister gangula kamalakar
  • ‘ఔట్ డేటెడ్ నేత’ అంటూ తనను గంగుల విమర్శించడంపై పొన్నం మండిపాటు
  • సీఎం కూతురు కవిత, వినోద్ రావు ఓడిపోలేదా అని ప్రశ్న
  • ‘గంగుల.. నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు’ అంటూ సవాల్ 
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దున్నపోతులా బలిసి రైతుల గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. దొంగ రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. తనను ఔట్ డేటెడ్ నేత అంటూ గంగుల చేసిన వ్యాఖ్యలపై బుధవారం పొన్నం కౌంటర్ ఇచ్చారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల? నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్.. సీఎం కూతురు కవిత ఓడిపోలేదా? ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా?’’ అని నిలదీశారు. 

‘‘గంగుల కమలాకర్.. నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు’’ అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీజేపీ నేత బండి సంజయ్, మంత్రి గంగుల ఆలయాల్లో కలుసుకుంటున్నారని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్ట్ షాప్‌ల పండుగ మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు.

నిన్న గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనే పొన్నం విలువ బయటపడిందని.. కనీసం కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. తన మీద పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారని, వారిద్దరూ ఒక్కటేనని ఆరోపించారు.
Ponnam Prabhakar
Gangula Kamalakar
Bandi Sanjay
KCR
Congress
Karimnagar

More Telugu News