Lawrence: 'చంద్రముఖి 2' ఎంతవరకూ వచ్చిందంటే..!

  • లారెన్స్ హీరోగా రూపొందిన 'చంద్రముఖి 2'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లోకి సాగే కథ 
  • తాజాగా షూటింగు పూర్తిచేసుకున్న సినిమా
  • సంగీతాన్ని అందించిన కీరవాణి    
Chandramukhi 2 Movie Update

'చంద్రముఖి' సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. రజనీకాంత్ ... ప్రభు .. జ్యోతిక .. నయనతార .. వడివేలు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అప్పట్లోనే వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. 

ఈ సినిమా కథాకథనాలు ఒక ఎత్తు .. సంగీతం ఒక ఎత్తు. విద్యాసాగర్ అందించిన సంగీతమే ఈ సినిమాకి హైలైట్. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి వాసు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ ఎందుకనో రజనీ ఒప్పుకోలేదు. దాంతో ఆయన అనుమతిని తీసుకునే, లారెన్స్ తో సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. 

ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. కంగనా రనౌత్ .. మహిమ నంబియార్ .. రాధిక .. .. లక్ష్మి మీనన్ .. వడివేలు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సారి ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. 

More Telugu News