ఇక నీ ఇంటర్వ్యూలు ఆపెయ్.. ఆదిపురుష్ రచయిత వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
- హనుమంతుడు దేవుడు కాదని, ఆయనొక భక్తుడన్న రచయిత
- ఆయన భక్తిలోని శక్తి కారణంగానే భగవంతుడిని చేశామని వ్యాఖ్య
- రచయిత వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం
ఆదిపురుష్ సినిమా ట్రోల్స్ పై శుక్లా మాట్లాడుతూ... ఆదిపురుష్ ను అణగదొక్కేందుకు రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు. మీరు ఈ సినిమాను చూస్తే ఎలాంటి ఫిర్యాదులు మీ నుండి రావని వ్యాఖ్యానించారు. హనుమంతుడి పాత్రపై మీకు స్పష్టత వస్తుందన్నారు. రాముడిలా తత్వవేత్త కాదని, కానీ హనుమంతుడు తెలివైనవాడు, బలవంతుడన్నారు. కానీ అతను మాట్లాడినప్పుడు, చిన్న పిల్లలలా మాట్లాడుతాడన్నారు.