Macron: ఎత్తిన బీరు సీసా దించకుండా ఖాళీ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు... వీడియో ఇదిగో!

  • ఫ్రాన్స్ లో రగ్బీ టోర్నీ విజేతగా నిలిచిన టౌలౌస్ జట్టు
  • డ్రెస్సింగ్ రూంలో సంబరాలు
  • హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
  • బీరు బాటిల్ అందుకుని గటగటా తాగేసిన దేశాధ్యక్షుడు
France President Macron drinks a beer in 17 seconds

ఫ్రాన్స్ లోని రగ్బీ క్రీడ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ నిర్వహించే స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్గీ జట్టు విజేతగా నిలిచింది. పాశ్చాత్య దేశాల జట్లు ఏవైనా క్రీడల్లో ట్రోఫీ గెలిస్తే డ్రెస్సింగ్ రూంలో షాంపేన్, తదితర మద్యం ఏరులై ప్రవహించడం సాధారణ విషయం. 

ఫ్రాన్స్ జాతీయ రగ్బీ చాంపియన్ నెగ్గి టౌలౌస్ టీమ్ కూడా డ్రెస్సింగ్ రూపంలో సంబరాలకు తెరలేపింది. అయితే ఈ సంబరాల్లో ఓ విశిష్ట వ్యక్తి పాల్గొనడమే హైలైట్. ఆయన ఎవరో కాదు... ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. 

టౌలౌస్ జట్టు అభిమాని అయిన మేక్రాన్... జట్టుతో పాటు డ్రెస్సింగ్ రూంలోకి వచ్చి ఆనందంగా గడిపారు. ఆటగాళ్లు ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా! అంతవరకు బాగానే ఉంది. 

దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి. మద్యాన్ని అధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధ్యక్షుడు... ఇలా బీరు కొట్టడం ద్వారా ప్రజలను తప్పుడు మార్గంలోకి ప్రోత్సహిస్తున్నాడని పలువురు నేతలు మండిపడుతున్నారు.

More Telugu News