Whatsapp: వాట్సాప్ లో గుర్తు తెలియని కాల్స్ ను ఇలా నిరోధించవచ్చు!

  • ఇటీవల వాట్సాప్ లో అంతర్జాతీయ స్పామ్ కాల్స్
  • సైలెంట్ అన్ నోన్ కాలర్స్ ఆప్షన్ తీసుకువచ్చిన వాట్సాప్
  • కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు తాజా ఫీచర్ తో చెక్
Whatsapp brings new feature to prevent unknown callers

ఇటీవల వాట్సాప్ లో అంతర్జాతీయ స్పామ్ కాల్స్ పెరిగిపోయాయి. దాంతో వాట్సాప్ ప్రైవసీ ఫీచర్లను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను అడ్డుకునేందుకు ఓ ఫీచర్ ను తీసుకువచ్చింది. దీని పేరు 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్'. 

యూజర్లు 'సెట్టింగ్స్' లోకి వెళ్లి కిందకు స్క్రోల్ చేస్తే 'ప్రైవసీ' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వచ్చే జాబితాలో 'కాల్స్' పై క్లిక్ చేయాలి. అక్కడ 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని అనేబుల్ చేస్తే సరి. మీ కాంటాక్ట్ లిస్టులో లేని, గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వచ్చినా ఇక మీకు వినిపించదు. ఓ మిస్డ్ కాల్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ చూపిస్తుంది. 

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఫీచర్ స్పామ్, స్కాం కాల్స్ ను ముందే గుర్తిస్తుంది. 

వాట్సాప్ పాత వెర్షన్లు ఉపయోగిస్తున్నవారు అప్ డేట్ చేసుకుంటే ఈ 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్' ఆప్షన్ కనిపిస్తుంది.

More Telugu News